నా జీవం నీ కృపలో దాచితివే

Telugu Christian Song

నా జీవం నీ కృపలో దాచితివే - నా జీవితకాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం - నా ఆశ్రయం నా జీవం నీ కృపలో దాచితివే 1. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితినే -2 కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడిచితివే -2 ॥ నా జీవం ॥ 2. వాగ్దానా భూమిలో మృతసముద్రపు భయము నన్ను వెంటాడెనే -2 వాక్యమైయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే -2 ॥ నా జీవం ॥ 3. స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా -2 స్తుతియాగాముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే -2 ॥ నా జీవం ॥ --Naa jeevam nee krupalo daachithive--
Telugu