నా కెంతో ఆనందం నీ

Telugu Christian Song

నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే 1. ఏ అపాయము నను సమీపించక ఏ రోగమైనను నా దరికి చేరక నీవు నడువు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితిరా 2. నా వేదనలో నిన్ను వేడుకొంటిని నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా --Naa kentho aanandam nee sannidhi--
Telugu
17 views