నా కోసమా ఈ సిలువ యాగము

Telugu Christian Song

నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2) కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా (2) || నా కోసమా || నా చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2) నీ చేతులలో… నీ పాదాలలో… నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే (2) యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) || నా కోసమా || నా మనస్సులో చెడు తలంపులకై నా హృదిలో చేసిన అవిధేయతకై (2) నీ శిరస్సుపై… నీ శరీరముపై… నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళను గుచ్చినారే (2) యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) || నా కోసమా || --Naa kosamaa ee siluva yaagamu--
Telugu