నా మార్గము నకు దీపమైన - నా యేసునితో సదా సాగెద

Telugu Christian Song

నా మార్గము నకు దీపమైన - నా యేసునితో సదా సాగెద 1. గాడాంధకారపు లోయలలో - మరణ భయము నన్ను క్షమ్మినను ఆత్మయందు నేను క్రుంగిపోవక - అనుదినం ఆనందింపచేయునట్టి ఆత్మనాధునితో సాగెదను || నా మార్గం|| 2. నా యొక్క ప్రయత్నములన్నియును - నిష్పలముగ అవి మారినను నా యొక్క ఆశలు అన్నియును - నిరాశలుగ మారిపోయినను నిరీక్షణతో నే సాగెదను || నా మార్గం|| 3. సమస్తమైన నా భారములు - సంపూర్ణముగ ప్రభు తీర్చునుగా నా సన్నిధి నీకు తోడుగా - వచ్చునని సెలవిచ్చిన నా దేవునితో సాగెదను
Hosanna ministries
Telugu