నా నీతి నీవే నా ఖ్యాతి

Telugu Christian Song

నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా నా క్రియలు కాదు నీ కృపయే దేవా నా ప్రాణమా యేసయ్యా నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చినా చాలవయ్యా నీ జీవితాన్నే నాకిచ్చినావు నీకే నా జీవమయ్యా హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (4) ||నా నీతి|| నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగ వచ్చావుగా నా దోష శిక్ష భరియించి నీవు నను నీలో దాచావుగా ఏమంత ప్రేమ నా మీద నీకు నీ ప్రాణమిచ్చావుగా నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను యజమానుడవు నీవేగా ||హల్లెలూయ|| నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు నీవు చేరదీసావుగా నా ప్రక్క నిలిచి నను ధైర్యపరచి కన్నీరు తుడిచావుగా నేనున్న నీకు భయమేలనంటూ ఓదార్పునిచ్చావుగా చాలయ్య దేవ నీ కృపయే నాకు బ్రతుకంతయు పండ
Telugu