నా నీతి సూర్యుడా – భువినేలు

Telugu Christian Song

నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని /2/ రాజులకే రారాజువు – కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి /నా నీతి/ 1. శ్రమలలో బహు శ్రమలలో – ఆదరణ కలిగించెను వాక్యమే కృపా వాక్యమే – నను వీడని అనుబంధమై /2/ నీ మాటలే జల ధారాలై – సంతృప్తి నిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురమ్! / రాజులకే / 2. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు యేదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని /2/ భీకరమైన కార్యములు చేయుచున్నవాడ సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్న వాడ ఘనపరతును నిన్నే! ప్రేమించే యేసయ్యా – నీవుంటే చాలునయ నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి /నా నీతి/ 3. స
Telugu