నా ప్రాణమా.. సన్నుతించుమా యెహోవా నామమును

Telugu Christian Song

నా ప్రాణమా.. సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును (2) అంతరంగ సమస్తమా సన్నుతించుమా (2) ||నా ప్రాణమా|| ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2) దీర్ఘ శాంత దేవుడు నిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా|| మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2) దాక్షిణ్యపూర్ణుడు నిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా|| --Naa pranamaa sannuthinchumaa yehova--
Telugu