నా ప్రాణము ప్రభువును కీర్తించును
నాలోనున్నదంతయు ఆయన పరిశుద్ధ నామము కీర్తింపగలదు (2)
ఆయన చేసిన ఉపకారములన్నిటిని
మరువకుడి నా ప్రాణమా (2)
హల్లెలూయా హల్లెలూయా
యెహోవాను ధన్యుని అనుము
హల్లెలూయా హల్లెలూయా
ఆయన పరిశుద్ధ నామము కీర్తింపుము (2) ||నా ప్రాణము||
ఆయన నీ పాపములన్నిటిని క్షమించును
నీ రోగములన్నిటిని స్వస్థపరచును (2)
నీ ప్రాణమును నాశనము నుండి విమోచించును
కృపా కరుణలతో నిన్ను కిరీటము పెట్టును (2) ||నా ప్రాణము||
నీ కోరికలను మంచివాటితో తృప్తిపరచును
నీ యౌవనము రాచిలిది వలె నూతనమగును (2)
యెహోవా నీతిని అనుసరించును
బాధపడువారందరికి న్యాయము చేయును (2) ||నా ప్రాణము||
--Naa pranamu pr