నా ప్రార్థనలన్ని ఆలకించినావు

Telugu Christian Song

నా ప్రార్థనలన్ని ఆలకించినావు నా స్తుతి¬మములన్ని- నీకే అర్పింతుము నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు 1.అడిగినంతకంటె-అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు-నీవే యేసయ్యా పరిపూర్ణమైన-నీ దైవత్వమంతా పరిశుద్ధతకే- శుభ ఆనవాలు ||నా ప్రార్థన|| 2.ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా సమీప భాందవ్యములన్నిటికన్నా మిన్నయైనది నీ స్నేహబంధము ||నా ప్రార్థన|| 3.ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిరపునాదులు ||నా ప్రార్థన|| --Naa prardhanalanni aalakinchinavu--
Telugu
1 views