నా రాజు యేసయ్యా నా ప్రభువు నీవే

Telugu Christian Song

నా రాజు యేసయ్యా నా ప్రభువు నీవే నా జీవితమంతా నీకే అంకితము (2) నా హృదయ సింహాసనమున నీవు కూర్చొని రాజ్యము చేయుము (2) హోసన్నా హోసన్నా దావీదు కుమారుడా హోసన్నా హోసన్నా రాజాధి రాజువా (2) ||నా రాజు|| నీ వాక్యము నా దీపము నీ మార్గము నా త్రోవ (2) నీ ప్రేమ నా ఆధారము నీ కృప నా ఆశ్రయము (2) ||నా రాజు|| నీ సేవలో నిలుచుందును నీ కార్యము చేయుదును (2) నీ నామము ప్రకటింతును నీ సువార్త వ్యాపింతును (2) ||నా రాజు|| --Naa raaju yesayya naa prabhuvu neeve--
Telugu
16 views