నా సమీపమై యున్న

Telugu Christian Song

నా సమీపమై యున్న - నా దేవుడవేసయ్యా నా చేరువలో ఉన్న - నా ఆత్మీయ బంధువుడా = 2 నా ముందూ వెనకను నీవే - నా ఇరుప్రక్కలను నీవే - 2 అంతట వ్యాపించి యున్న - మహిమా ఘనతయు నీకే - 2 1. తెలిసి తెలిసి ఎన్నో మారులు - దోషము చేసిన పాపిని - 2 కలువరి రుధిరముతో - కడిగిన నాధుడవు కరుణా కాటాక్షము - నిలిపిన ప్రభుడవు = 2 2.నిరాశ నిస్పృహ వేళలో - గమ్యము చూపిన ఘనుడవు - 2 వెనుకున్నవి మరచి - ముందున్న మకుటముకై సియోనులో చేరుటే - నా చిరకాల కోరిక = 2 --Naa sameepamai yunna na devuda--
Telugu