నా సంకటంబులన్నియు తీరిపోయె

Telugu Christian Song

నా సంకటంబులన్నియు తీరిపోయె సంహారరదూత నన్ను దాటిపోయె 1. గొఱ్ఱెపిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ బొందితిన్ ||నా సంక|| 2. ఫరోకు నేనింక దాసుడను కాను పరమకానానుకు హక్కుదారుడను ||నా సంక|| 3. మారాను మధురముగ మార్చినాకు బండను పగులగొట్టి దాహం దీర్చెను ||నా సంక|| 4. మనోహరముగ నున్న కానాన్ రాజ్యమే అదే నాకు స్థిరమైన అవకాశము ||నా సంక|| 5. ఆనందమే పరమానందమే కానాన్ జీవితము నాకు ఆనందమే ||నా సంక|| 6. అరణ్యజీవితమున యేసు నాయకుడు ప్రతిదినం నూతనమన్నా ఆయన యిస్తాడు ||నా సంక|| 7. నా బలము నా ఆశ్రయము నా రక్షణ యేసయ్య హల్లెలూయా ||నా సంక|| --Naa sankatambu lanniyu theeripoye--
Telugu