నా వేదనలో - వెదకితిని

Telugu Christian Song

నా వేదనలో - వెదకితిని శ్రీ యేసుని -పాదాలను నా మనస్సులో - కోరితిని నీ రూపమునే - దీనుడనై నీ రూపమునే - దీనుడనై నా వేదనలో - వెదకితిని 1. వేకు జాములో - విలపించితిని నా పాపములో - వ్యసనములో -2 ఓదార్చుము - విసుగొందక నీ కృపలో - నా ప్రభువా -2 ॥ నా వేదన ॥ 2. నీ హస్తములో - నిదురింప జేయుమా నీ ప్రేమలో - లాలించుమా -2 ఓదార్చుము - విసుగొందక నీ కృపలో - నా ప్రభువా -2 ॥ నా వేదన ॥ --Naa vedanalo vedakithini--
Telugu