నాకెంతో ఆనందం నీ సన్నిధి

Telugu Christian Song

నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే (2) నాకెంతో ఆనందం… ఏ అపాయము నను సమీపించక ఏ రోగమైనను నా దరికి చేరక (2) నీవు నడువు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితిరా (2) ||నాకెంతో|| నా వేదనలో నిన్ను వేడుకొంటిని నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని (2) నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా (2) ||నాకెంతో|| నూతన యెరూషలేం నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా (2) నీవుండు స్థలములో నేనుండ గోరెదను నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా (2) ||నాకెంతో|| --Naakentho aanandam nee sannidhi--
Telugu
1 views