నాకోరిక నీ ప్రణాళిక

Telugu Christian Song

నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నాప్రార్థన విజ్ఞాపనా - నిత్యమహిమలో నిలవాలని అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను ఆశలవాకిలి తెరచినావు - అనురాగవర్షం కురిపించినావు నాహృదయంలో ఉప్పొంగెనే - కృతజ్ఞతా సంద్రమే నీసన్నిధిలో స్తుతి పాడనా - నాహృదయ విద్వాంసుడా యదార్థవంతులయెడల - నీవు యెడబాయక కృపచూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు నన్నునీవువిడిపించినావు - ఇష్టుడనై నేనడచినందున దీర్ఘాయువుతో తృప్తిపరిచిన - సజీవుడవు నీవేనయ్యా నాలో ఉన్నది విశ్వాసవరము - తోడైయున్నది వాగ్దానబలము ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిశగా ఆర్పజాలని నీప్రేమతో - ఆత్మదీపము వెలిగించినావు దీనమనస్సు వినయభావము నాకు
Telugu