నాలో ఉన్న ఆనందం

Telugu Christian Song

నాలో ఉన్న ఆనందం నాకున్న సంతోషం నా జీవన ఆధారం నీవే కదా (2) ||నాలో|| నా ఆశ్రయము నా దుర్గము నా కోట నీవే యేసు నా బలము… నా యేసుడే (2) గాఢాంధకారములో నే సంచరించిననూ ఏ అపాయమునకు నే భయపడను (2) నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నాదరించును నా యేసయ్యా (2) ||నా ఆశ్రయము|| నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమును నన్నాదరించును నా వెంట వచ్చుఁను (2) చిరకాలము నేను నీ మందిరావరణములో నివాసము చేసెదను నా యేసయ్యా (2) ||నా ఆశ్రయము|| --Naalo unna aanandham--
Telugu