నడిపించు నా నావా

Telugu Christian Song

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు|| నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు|| రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు|| ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు|| ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వద
Telugu