నే బ్రతికి ఉన్నానంటే

Telugu Christian Song

నే బ్రతికి ఉన్నానంటే – అది కేవలం నీ కృప ఈ స్థితిలో ఉన్నానంటే – అది క్రీస్తు మహా కృప (2) నీ ప్రేమ బలమైనది నీ మాట విలువైనది (2) ||నే బ్రతికి|| లోకములో నేనుండగా నీ కరములు చాపి పిలిచావయ్యా దుఃఖములో నేనుండగా నన్ను ఓదార్చినావు నా యేసయ్యా (2) నా ఆధారము నీవే నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి|| నా వారలే నన్ను నిందించినా నా బంధువులే నన్ను వెలివేసినా (4) ఎవరున్నా లేకున్ననూ నీ తోడు చాలునయ్యా ఏమున్నా లేకున్ననూ నీ కృపయే చాలునయ్యా ||నే బ్రతికి|| నా స్థితి నీవు చూసావయ్యా నా గతినే నీవు మార్చావయ్యా (2) నా ఆధారము నీవే నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి|| --Ne brathiki unnanante ad
Telugu