నే స్తుతించెదను యేసు నామమును

Telugu Christian Song

నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను ||నే స్తుతించెదను|| ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింప నెవ్వరికి తరమౌనా? (2) పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమనపారముగా (2) ||నే స్తుతించెదను|| పాపములన్నియు బాపుటకై శాపములన్నియు మాపుటకై (2) ఏ పాపమెరుగని ఆ పావనుడు శాపగ్రాహియై చావొందెను (2) ||నే స్తుతించెదను|| శోధన కాలముల యందున వేదన కాలముల యందున (2) నాధుడు యేసు మనతోడనుండ అంతమేగా మన చింతలకు (2) ||నే స్తుతించెదను|| ఎనలేని ప్రేమతో కౌగిలించెను ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను (2) మహామహుండు మహిమ ప్రధానుడు మహిమతో వచ్చును
Telugu