నేడో రేపో నా ప్రియుడేసు

Telugu Christian Song

నేడో రేపో నా ప్రియుడేసు - మేఘాల మీద ఏతెంచును (2x) మహిమాన్వితుడై ప్రభు యేసు - మహి స్థలమునకు ఏతెంచును (2x) ...నేడో... చీకటి కమ్మును సూర్యుని - చంద్రుడు తన కాంతి నీయడు (2x) నక్షత్రములు రాలిపోవును - ఆకాశ శక్తులు కదలిపోవును (2x) ...నేడో... కడబూర స్వరము ధ్వనియించగా - ప్రియుని స్వరము వినిపించగా (2x) వడివడిగ ప్రభు చెంతకు చేరెద - ప్రియమార ప్రభుయేసును గాంచెద (2x) ...నేడో... నా ప్రియుడేసుని సన్నిధిలో - వేదన రోధనలుండవు (2x) హల్లెలూయ స్తుతి గీతాలతో - నిత్యము ఆనంద మానందమే (2x) ...నేడో... --Nedo repo naa priyu desu--
Telugu