నీ ఆనంద తైలముతో

Telugu Christian Song

నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా (2) తడిసెదను.. నీ జీవనదిలో (2) తడిసి తడిసి ఆనందించెదా (2) ||నీ ఆనంద|| వీడిపోయెను నా పాప సంకెళ్లు నన్ను తొలగిపోయెను నా శాపపు కట్లు (2) దైవమా.. నీవే ఇచ్చావు రక్షణ (2) నే మరువగలనా నీ మంచి ప్రేమ (2) ||నీ ఆనంద|| నీ ఆత్మ నాకు తోడుండగా కానెన్నడు కాను ఒంటరిని (2) ప్రేమా ప్రవాహం ఉంచావే నాలోన (2) నే మరువగలనా నా హృదయములో (2) ||నీ ఆనంద|| నే దాటిపోదును దేశ సరిహద్దులు ప్రకాశించెద చీకటి లోకంలో (2) జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా (2) నన్ను వాడుకొనుమా నీ దివ్య సేవలో (2) ||నీ ఆనంద|| --Nee aanandha thailamutho nannu--
Telugu