నీ దయ గొప్పది యెహోవా

Telugu Christian Song

నీ దయ గొప్పది యెహోవా ఆకాశములవరకు ఎత్తయియున్నది (2) నీ నమ్మకత్వము మేఘములవరకు చేరుచున్నది (2) దేవా నీ దయ అమూల్యము మానవులు నీ రెక్కల నీడను ఆశ్రయింతురు (2) నీ మందిరపు సమృద్ధిచే సంతృప్తులగుదురు నీ సుఖ నదిని త్రాగింపచేసెదవు (2) ||నీ దయ|| నీయొద్ద జీవపు ఊట ఉన్నది నీ వెలుగులో మేము వెలుగు చూచెదము (2) నిన్ను ఎరిగినవారికి నీ కృపను యథార్థహృదయులకు నీ నీతిని కలుగజేయుము (2) ||నీ దయ|| --Nee daya goppadi yehova--
Traditional
Telugu