నీ ధనము నీ ఘనము

Telugu Christian Song

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా ||నీ ధనము|| ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా (2) పరలోక నాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీ ధనము|| పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా (2) వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా ||నీ ధనము|| వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2) వెలిగించ ధరపైని ప్రభు నామము కలిమికొలది ప్రభున కర్పింపవా ||నీ ధనము|| కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలు బాధభరితంబులు (2) బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||నీ ధనము|| --Nee dhanamu nee ghanamu--
Telugu