నీ కృప బాహుళ్యమే
నా జీవిత ఆధారమే (2)
నీ కృపా…నీ కృపా…
నీ కృపా…నీ కృపా… (2)
1. శృతులు లేని…
వీణనై మతి తప్పినా వేళ (2)
నీ కృప వీడక
నన్ను వెంబడించెనా (2)
నన్ను వెంబడించెనా (4) || నీ కృపా…
2. శ్రమలలో…
పుటమువేయబడిన వేళ (2)
నీ కృప నాలో
నిత్యజీవ మాయెనా (2)
నిత్యజీవ మాయెనా (4) || నీ కృపా…
--Nee krupa bahulyame naa jeevitha aadharame--