నీ కృప నిత్యముండును

Telugu Christian Song

నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2) నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము (2) ||నీ కృప|| 1. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2) కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2) ||నీ కృప|| 2. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2) ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2) ||నీ కృప|| 3. అనుభవ అనురాగం కలకాలమున్నట్లె నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2) రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2) ||నీ కృప|| --Nee krupa nithyamundunu nee krupa
Hosanna ministries
Telugu
1 views