నీ మేలులు వివరింపతరమా

Telugu Christian Song

నీ మేలులు వివరింపతరమా నీ మేలులు వివరింపతరమా ప్రభువా నీ కృపలను నే మరువగలనా ఆదరించావు అగాపే ప్రేమతో ఆదుకున్నావు నీ జాలి మనసుతో - నీ జాలి మనసుతో 1. శోధనలే నన్ను వెన్నంటిఉన్నా బహు శ్రమలతో నేను సతమతమవుతున్నా నను ధైర్యపరచి నడిపించినావే నా హృదయవేధన తొలగించినావే | ఆదరించావు| 2. ఊహించలేని కార్యాలు ఎన్నో లెక్కించలేని పర్యాయములలో నా జీవితంలో జరిగించినావే నీ క్రుపతో నిత్యము దీవించినావే |ఆదరించావు| 3. మరచిపోలేని నీ మేలులెన్నో దయచేసినావు నా జీవితములో నీ ప్రేమకు సాటి లేదేది ఇలలో నీ కరుణకు బదులు ఏముంది ధరలో |ఆదరించావు| --Nee melulu vivarimpa tharama--
Telugu