నీ మహిమ ప్రకటించెదను సర్వ జనములలో
నీ అద్భుతములు వివరించెదను రాజ్యములన్నిటిలో (2)
నీ నామము మహోన్నతము
నీ కీర్తి అనంతము (2)
హల్లెలూయా హల్లెలూయా
యెహోవా నామము పరిశుద్ధము
హల్లెలూయా హల్లెలూయా
ఆయన మహిమ అద్భుతము (2) ||నీ మహిమ||
నీ బలపరాక్రమములను
నీ మహా కార్యములను (2)
ప్రజలకు తెలియజేయుదును
తరము తరమునకు చెప్పుదును (2) ||నీ మహిమ||
నీ రాజ్యము నిత్య రాజ్యము
నీ ఆధిపత్యము తరము తరమునకు (2)
నీవు పడిపోవువారిని లేపుచున్నావు
వంగినవారిని నిలుపుచున్నావు (2) ||నీ మహిమ||
--Nee mahima prakatinchedanu sarva--