నీ ముఖము మనోహరము

Telugu Christian Song

నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన 1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై అణువణువున నీకృప నిక్షిప్తమై – నను ఎన్నడు వీడని అనుబంధమై "యేసయ్య" 2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై – నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు "యేసయ్య" 3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై – నను మైమరచి నేనేమి చేసేదనో "యేసయ్య" --Nee mukhamu manoharamu--
Telugu