నీ నామమే ఎద కొలిచెదను

Telugu Christian Song

నీ నామమే ఎద కొలిచెదను నీ వాక్యమునే సదా తలచెదను (2) సైన్యములకధిపతియగు దేవా ఆది దేవుడవయిన యెహోవా (2) ||నీ నామమే|| దోష రహితుడ – సృష్టి కారుడ నేరమెంచని నిర్ణయకుడా సిలువ దరుడ – మరణ విజయుడ లోక రక్షక యేసు నాథుడా (2) ||సైన్యము|| నిన్ను మరచిన – మిగులు శూన్యము నీతో అణకువ పెంచు జ్ఞానము నాదు లోకము – బహు కలవరము నీదు వాక్యము తెలుపు మార్గము (2) ||సైన్యము|| క్షణము వీడని – నీడ నీవని నమ్మి నిరతము నిన్ను వేడెద నీదు పాత్రగ – యాత్ర సాగెద నీదు ఘనతను ఎలిగి చాటెద (2) ||సైన్యము|| --Nee naamame yeda kolichedanu--
Telugu