నీ పద సేవయే చాలు

Telugu Christian Song

నీ పద సేవయే చాలు యేసు నాకదియే పది వేలు నీ పద సేవయే చాలు నీ పద జ్ఞానము నాకిలా క్షేమము నీ పద గానము నాకిలా ప్రాణము (2) ||నీ పద|| నీ నామమునే స్తుతియింపగను నీ వాక్యమునే ధ్యానింపగను (2) నీ రాజ్యమునే ప్రకటింపగను (2) దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద|| నీ దరినే నివసింపగను జీవమునే సాధింపగను (2) సాతానును నే నెదిరింపగాను (2) దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద|| నీ ప్రేమను నే చూపింపగను నీ త్యాగమునే నొనరింపగను (2) నీ సహనమునే ధరియింపగను (2) దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద|| --Nee pada sevaye chaalu--
Telugu