నీ ప్రేమ బహు గొప్పది యేసయ్య

Telugu Christian Song

నీ ప్రేమ బహు గొప్పది యేసయ్య 1. పాపాల సుడిగాలిలో- పడిపొతి నిను తెలియక శాపాల సముద్రములో- దిగిపోతి నిను యెరుగక కరుణించినావు - కాపాడినావు, కరములు చాపి నన్ను లేపావు 2. పాపిని రక్శింపనూ-పరలొకము విడచినాయ్య నన్ను పరిశుద్దునిగా చేయనూ - నీ రక్తన్ని కార్చావయ్య నీచుని ప్రేమించి-నీ ప్రాణమిచ్చావు నీ నిత్యరాజ్యములో వారసునిగా చేశావు 3. నీ ప్రేమనే చాటను- నన్నిలలో నిలిపావయ్య నీ సాక్శిగా బ్రతుకను-నీ క్రుప నాకు చూపావయ్య ఏమిచ్చి నీ రుణం - నే తీర్చగలనయ్య నా జీవితం- నీకు అర్పింతును యెసయ్య --Nee prema bahu goppadi yesayya--
Telugu