నీ ప్రేమ నా జీవితాన్ని

Telugu Christian Song

నీ ప్రేమ నా జీవితాన్ని – నీకై వెలిగించెనే యేసయ్యా నీ కృప సెలయేరులా – నాలో ప్రవహించెనే (2) నన్ను క్షమియించెనే – నన్ను కరుణించెనే నన్ను స్థిరపరచెనే – నన్ను ఘనపరచెనే (2) యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా (2) నేను నిన్ను విడచిననూ – నీవు నన్ను విడువలేదయ్యా దారి తప్పి తొలగిననూ – నీ దారిలో నను చేర్చినావయ్యా (2) ఏమివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేని నీ ప్రేమను (2) ||యేసయ్యా|| జలములు నన్ను చుట్టిననూ – నీ చేతిలో నను దాచినావయ్యా జ్వాలలు నాపై లేచాను – నీ ఆత్మతో నను కప్పినావయా (2) ఏమివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేని నీ ఆత్మను (2) ||యేసయ్యా|| --Nee prema naa jeevithanni--
Telugu