నీ ప్రేమ నాలో మధురమైనది

Telugu Christian Song

నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపరతు నిన్నే సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ|| చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు (2) హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2) ఇది నీ బాహు బంధాల అనుబంధమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ|| నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే (2) ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే – నీ కృపయే నాకు చాలును
Telugu
1 views