నీ ప్రేమయే నాకు చాలు

Telugu Christian Song

నీ ప్రేమయే నాకు చాలు నీతోడు నాకుంటే చాలు నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా యేసయ్యా. . ఆ. . ఆ. . యేసయ్యా. . ఆ. . ఆ. . యేసయ్యా. . ఆ. . ఆ. . యేసయ్యా. . యేసయ్యా. . 1. నీ ప్రేమతోను నీ వాక్కుతోను నిత్యము నన్ను నింపుమయ్యా నీ ఆత్మతోను నీ సత్యముతోను నిత్యము నను కాపాడుమయ్యా నీ సేవలో నీ సన్నిధిలో నీ మాటలో నీ బాటలో నిత్యము నను నడిపించుమయ్యా 2. నువు లేక నేను జీవించలేను నీ రాకకై వేచియున్న నువు లేని నన్ను ఊహించలేను నాలోన నివసించుమన్న నా ఊహలో నీ రూపమే నా ధ్యాసలో నీ ధ్యానమే నీ రూపులో మార్చెనయ్యా --Nee premaye naaku chaalu--
Telugu
18 views