నీ స్వరము వినిపించు

Telugu Christian Song

నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ వాక్యమును నేర్పించు దానియందు నడచునట్లు నీతో |నీ.. 1. ఉదయముననే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నను సిద్దపరచు రక్షించు ఆపదల నుండి |నీ.. 2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు సరి జేసుకొందు నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు |నీ.. 3. భయ భీతులతో తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను |నీ.. 4. నాతో మాట్లాడు స్పస్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే నీతో మనుష్యులతో సరిజేసుకొందు నీ దివ్య వాక్యము ద్వారా |నీ.. --Nee swaramu vinipinchu--
Telugu