నీ సన్నిధిలో ఆనందము పరిపూర్ణత

Telugu Christian Song

నీ సన్నిధిలో ఆనందము పరిపూర్ణత నీ కుడి పార్శ్వమున నిత్య సుఖము (2) నీతోనే ఉండుటకు నాకు కావలసినదంతయు నీవే (2) ఆరాధించెదను నిన్ను నా దేవా స్తుతించెదను నిన్ను నా ప్రభువా (2) నీ మహిమను వర్ణించెదను నీ కీర్తిని ప్రకటించెదను (2) ||నీ సన్నిధిలో|| నీ సన్నిధిలో శాంతి నీ సముఖమున సంతోషము (2) నీ ఆలింగనములో సుఖము నీ ప్రేమలో పరవశము (2) ||నీ సన్నిధిలో|| నీ వాక్యము నా ఆహారము నీ సన్నిధి నా నివాసము (2) నీ ముఖము చూడడము నా ఆత్మ కోరిక (2) ||నీ సన్నిధిలో|| --Nee sannidhilo aanandamu pari poornatha--
Traditional
Telugu
15 views