నీ త్యాగం నా విలువను

Telugu Christian Song

నీ త్యాగం నా విలువను పెంచింది నీ రుధిరం నా పాపం తుడిచింది నీ శాంతం నా మదిని గెలిచింది నీ ప్రేమయే నా గాయం మాన్పింది. నీ సిలువే నా శరణం నీ రక్తమే నా విజయం. 1.విలువే లేని నాకోసం – మరణించావు ఈ భువిలో చలనం లేని నా బ్రతుకు – చిగురించింది నీ ప్రేమలో కమ్మేసిన చీకట్లను – నిత్య వెలుగుగా మార్చావు సర్వస్వము నాకోసము – సిల్వపై ధారపోశావు. 2. జీవం లేని నాకోసం – జాలినొందెను నీ హృదయం ప్రేమతో నిండిన నీ స్పర్శతో- వికసించింది నా మనసు సాటెవ్వరు నా యేసయ్య – ఈ జీవితం నీకెనయ్య ప్రత్యేకము నీ స్వాస్థ్యము – సాగిపోదును నీకోసమే --Nee thyaagam naa viluvanu--
Telugu
15 views