నీ ఉదయ కాంతిలో

Telugu Christian Song

నీ ఉదయ కాంతిలో – నే నడచివెళ్ళెద నీ అడుగు జాడలే నే అనుసరించెద నదివలె నీ సమాధానము – విడిచిపోని సహవాసము నా తోడుగా ఉంచావయ్యా – నా తండ్రివై నా యేసయ్య నీ వాక్యపు వెలుగులో నా స్థితిని చూచితి నా భారము, నా భయమును, తొలగించి దరి చేరితివి చీకటిలోనుండి ఆశ్చర్యమైన నీ వెలుగుకు పిలచిన దేవా నా రక్షణ దీపం వెలిగించినావే నీ మహిమకై ప్రకాశించెద ఏ జలమైనా ఏ జ్వాలైనా నే భయముచెందను విశ్వాసమే నా బలం నీతోనే విజయము నను మరువని నీ ప్రేమ, విడువని నీ కృపకు, మరిఏదీ సాటిరాదయా ఆ ప్రేమను తలచి, నీలోనే నిలచి, నీ కృపలో సాగెదనయ్యా --Nee udaya kanthilo ne--
Telugu