నీలో జీవించాలని నీలోనే

Telugu Christian Song

నీలో జీవించాలని నీలోనే బ్రతకాలని (2) యుగయుగాల నీతోనే ఉండాలని (2) తుది శ్వాస వరకు నీలోనే నా గమ్యం (2) యేసూ నువ్వే కావాలి నా యేసూ నీతో ఉండాలి (2) ||నీలో|| మిగిలింది నాకు నిత్య శోకము ఈ నా జీవిత యాత్రలో కన్నీళ్లే నాకు అన్న పానములై భుజియించుచుంటిని నిత్యము ప్రభువా (2) నీవు నాకు ప్రత్యక్షము అయిన వెంటనే (2) నా దుఃఖ దినములన్ని సమాప్తమాయెను (2) ||యేసూ|| కటిక చీకటే నాకు స్నేహమాయెను అంధకారమే నాలో నాట్యమాడెను ఎటు వైపు చూసినా వెలుగు కాన రాలేదు మార్గమే తెలియక మతి చెలించెను (2) నీ వైపు చూడగానే వెలుగు కలిగె దేవా (2) నీ నామమే నాకు మార్గమాయెను (2) ||యేసూ|| --Neelo jeevinchalani neelone brathakaalani--
Telugu