నీలో సమస్తము సాధ్యమే

Telugu Christian Song

నీలో సమస్తము సాధ్యమే (2) మహొన్నతుడా యేసయ్యా బలవంతుడా యేసయ్యా (2) ఆరాధింతును – నిన్నే స్తుతియింతున్ (4) ||నీలో|| అలసియున్న నా ప్రాణమును సేదదీర్చువాడవు జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు (2) ప్రార్థనలన్ని ఆలకించువాడవు నీవు అడిగినవన్ని ఇచ్చేవాడవు నీవు (2) ||మహొన్నతుడా|| శోధన వేదనలలో జయమిచ్చువాడవు బుద్దియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు (2) నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు (2) ||మహొన్నతుడా|| --Neelo samasthamu saadyame--
Telugu