నీతి సూర్య తేజోమయుడా

Telugu Christian Song

నీతి సూర్య తేజోమయుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడా పదివేలలో అతి శ్రేష్ఠుడా శుద్ధుడా మహిమాన్వితుడా పల్లవి: మనసు మార్చు పరమ తండ్రి నీదు ఆత్మతో నేను నిండా మనసు మార్చు పరమ తండ్రి నీదు రూపులో నేను మారా నీదు మహిమతో నేను నిండా 1. పనికిరాని పాత్రను నేను పడిపోయిన పామరుండన్ మంచిలేని పాపిని నేను చీకటి నిండిన అపవిత్రుడను 2. నీదు సన్నిధిన్ నేను వదలి నీదు స్మరణను నేను మాని మలినం నిండి మార్గము తప్పి చెదరివున్న దోషాత్ముడను 3. సౌఖ్యము కోరి క్షేమము మరచి దైవ ఆజ్ఞన్ నేను విడిచి కానరాని దూరం పోయి ఒంటరినైనా అనాధుడను --Neethi soorya thejomayuda--
Telugu