నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా
నూతన బలమును నవ నూతన కృపను
నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా
1. ఆనందించితిని అనురాగబందాల - ఆశ్రయపురమైన నీలో నేను
ఆకర్షించితివి ఆకాశముకంటే - ఉన్నతమైన నీ ప్రేమను చూపి
ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి
ఆవేదనల అగ్ని జ్వాలలో అండగ నిలిచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా - ఈ స్తోత్ర గీతం నీకెనయ్యా
2. సర్వకృపానిధి సీయోను పురవాసి - నీ స్వాస్త్యముకై నను పిలచితివి
సిలువను మోయుచు నీ చిత్తమును - నెరవేర్చెదను సహనము కలిగి
శిధిలము కాని సంపదలెన్నో నాకై దాచితివి
సాహసమైన