నీవే నా స్నేహము

Telugu Christian Song

నీవే నా స్నేహము – నీవే నా సర్వస్వము నీవే ఆధారము – నీవే నా ఆనందము నీ ప్రేమ నాలో పదిలము నీలోనే సాక్ష్యమే సంతోషము (2) సర్వోన్నతుడా నీకే మహిమ పరమ తండ్రి నీకే ఘనత (2) ||నీవే|| నా జీవితాంతం నిన్నే పొగడెదను నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే (2) నా దేవుని మందిరములో నివసించెదను నా స్తుతి నైవేద్యం నీకే అర్పించెదను – (2) ||సర్వోన్నతుడా|| నా బలహీన స్థితిలో గతివి నీవైతివే నా కన్నీరు నాట్యముగా మార్చినది నీవే (2) కృంగిన నా హృదయమును లేవనెత్తితివి అసాధ్యమైనది నీకు ఏదియు లేదయా – (2) ||సర్వోన్నతుడా|| --Neeve naa snehamu--
Telugu