నీవే శ్రావ్యసదనము - నీదే శాంతి సదనము
నీ దివి సంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా
నా ప్రతిస్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్యా " నీవే "
1. విరజిమ్మే నాపై కృపాకిరణం
విరబూసే పరిమళమై కృపా కమలం (2)
విశ్వాస యాత్రలో ఒంటరినై - విజయ శిఖరము చేరుటకు
నీ దక్షిణ హస్తము చాపితివి - నన్నాదుకొనుటకు వచ్చితివి
నను బలపరచి నడిపించే - నా యేసయ్యా (2) " నీవే "
2. నీ నీతి రాజ్యం వెదకితిని
నిండైన సాభాగ్యం పొందుటకు (2)
నలిగివిరిగిన హ్రుదయముతో - నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయష్కరమైన దీవెనతో - శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి - నా యేసయ్యా (2)