నీవు అన్నావు గుర్తుందా ||2||
నా చెయ్యి ఆ ప్రభువు యెన్నటికి విడువడని
యెప్పటికి మరువడు అని ||నీవు||
నీ దివ్య సందేశము.. ప్రసంగి
విన్న ఆ రోజు.. ఆ తియ్యని రోజు..
ఆ కమ్మని రోజు.. మధురం
ఆ యేసు బోధలు అన్నీ మధురం
నీ నవ్య సందేశము.. ప్రసంగి..
విన్న ఆ రేయి.. ఆ పున్నమి రేయి..
ఆ వెన్నెల రేయి.. మధురం
ఆ యేసు గాధలు యెంతో మధురం
నీ ఆత్మ సందేశం.. ప్రసంగి
విన్న ఆ వేళ.. ఆ చక్కటి వేళ..
ఆ చల్లని వేళ.. మధురం
మన యేసు బోధలు మధురాతి మధురం
--Neevu annavu gurthunda--
--Velugu rekha--