పల్లవి: నీవు గాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య
నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య
1. ఘోరపాపముతో నిండిన నా హృదిని
మార్చితివే నీదరి చేర్చితివే
హత్తుకొని ఎత్తుకొని
తల్లివలె నన్ను ఆదరించితివే || నీవు గాక ||
2. అడుగులు తడబడిన నా బ్రతుకుబాటలో
వెదకితివే నావైపు తిరిగితివే
స్థిరపరచి బలపరచి
తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే || నీవు గాక ||
--Neevu gaaka evarunnaru naaku ilalo yesayya--