నీవు నా రక్షకుడవు నా విమోచకుడవు

Telugu Christian Song

నీవు నా రక్షకుడవు నా విమోచకుడవు పాప బానిసత్వము నుండి నన్ను విడిపించినావు (2) శాతాను బంధనము విరిచి నన్ను స్వతంత్రుని చేసినావు (2) హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీవు నా రక్షకుడవు హల్లెలూయా హల్లెలూయా నీవు నా విమోచకుడవు (2) ||నీవు నా రక్షకుడవు|| నీ సత్యము నన్ను స్వతంత్రుని చేసెను నీ వాక్యము నన్ను విడిపించెను (2) ఇకమీదట నేను బానిసను కాను నేను దేవుని కుమారుడను (2) ||నీవు నా రక్షకుడవు|| పాపము నామీద ఆధిపత్యము చేయదు నేను కృపచే జీవించుచున్నాను (2) నీతికి బానిసుడనై పరిశుద్ధతకై జీవించెదను (2) ||నీవు నా రక్షకుడవు|| --Neevu naa rakshakudavu naa vimochakudavu--
Telugu
10 views