నీవు నా తండ్రివి నేను నీ బిడ్డను
నీ కుమారుడను నీ కుమార్తెను (2)
నీవు నన్ను ప్రేమించితివి
నేను నిన్ను ప్రేమించుచున్నాను (2)
అబ్బా తండ్రి అబ్బా తండ్రి
నీకు మహిమ స్తుతి కలుగునుగాక
అబ్బా తండ్రి అబ్బా తండ్రి
నిన్ను ఆరాధించెదను నా దేవా (2) ||నీవు నా||
నీవు నన్ను కలుసుకొన్నావు
నీవు నన్ను దత్తత తీసుకొన్నావు (2)
నీ కుటుంబములో చేర్చుకొన్నావు
నీ వారసత్వము నాకిచ్చినావు (2) ||నీవు నా||
పరిశుద్ధాత్మ నా హృదయములో
అబ్బా తండ్రి అని మొఱ్ఱపెట్టుచున్నాడు (2)
నేను సేవకుడను కాను
నేను కుమారుడను వారసుడను (2) ||నీవు నా||
--Neevu naa thandrivi nenu nee biddanu--