నేనంటే నీకు ఎంతిష్టమో

Telugu Christian Song

నేనంటే నీకు ఎంతిష్టమో నా మంచి యేసయ్యా (2) నా మీద నీకు ఎనలేని ప్రేమ (2) ప్రతి క్షణము నీకే నా ఆరాధనా (2) ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా (2) నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో మరి దేనిని ప్రేమించలేదు నాకిచ్చిన స్థానం పరమందున దూతలకు ఇవ్వలేదు (2) ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి మదిలో నిలచిన మంచి దేవుడా (2) ||ఆరాధనా|| నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే క్రయ ధనముగా ఇచ్చి బంధింపబడిన నా బంధకాలు సిలువ యాగముతో తెంచి (2) మరణించవలసిన నాకై నిత్య జీవం ప్రసాదించిన మంచి దేవుడా (2) ||ఆరాధనా|| --Nenate neeku yenthishtamo--
Telugu