నిన్ను ఎన్నుకొంటిని నా దేవా
నిన్ను సేవింతును నా ప్రభువా (2)
నీకు నా జీవితము అంకితము
నీకు నా హృదయము అర్పితము (2)
యేసయ్యా యేసయ్యా నిన్ను ఎన్నుకొంటిని
యేసయ్యా యేసయ్యా నిన్ను అనుసరింతును (2) ||నిన్ను ఎన్నుకొంటిని||
ఇతర దేవతలను సేవింపను
ఇతరులను ఆరాధింపను (2)
నీవొక్కడివే నా దేవుడవు
నిన్ను మాత్రమే ఆరాధింతును (2) ||నిన్ను ఎన్నుకొంటిని||
నా ఇంటివారందరము
నిన్నే సేవింతుము (2)
మా కుటుంబము నీదే
మా జీవితములు నీకే (2) ||నిన్ను ఎన్నుకొంటిని||
--Ninnu yennukontini naa deva--